Sunday, 4 January 2015

Hebrews - హెబ్రీయులకు 1

Hebrews - హెబ్రీయులకు 1

1. పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడుreference

1. God, who at sundry times and in divers manners spoke in times past unto the fathers by the prophets,

2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
referenceద్వితియోపదేశకాండము 32:18reference, కీర్తనలు 2:8reference

2. hath in these last days spoken unto us by His Son, whom He hath appointed Heir of all things, by whom also He made the worlds,

3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,3 ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
referenceకీర్తనలు 45:2reference, కీర్తనలు 110:1reference

3. who being the brightness of His glory and the express image of His person, upholding all things by the word of His power, when He had by Himself purged our sins, sat down at the right hand of the Majesty on high,

4. మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను.
referenceకీర్తనలు 45:2reference

4. being made so much better than the angels, as He hath by inheritance obtained a more excellent name than they.

5. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?
reference2 సమూయేలు 7:14reference, 1 దినవృత్తాంతములు 17:13reference, కీర్తనలు 2:7reference

5. For unto which of the angels said God at any time, "Thou art My Son; this day have I begotten Thee"? And again, "I will be to Him a Father, and He shall be to Me a Son"?

6. మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు.
referenceద్వితియోపదేశకాండము 32:43reference, కీర్తనలు 97:7reference

6. And again, when He bringeth in the First-Begotten into the world, He saith, "And let all the angels of God worship Him."

7. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
referenceకీర్తనలు 104:4reference

7. And of the angels He saith, "Who maketh His angels spirits and His ministers a flame of fire."

8. గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
referenceకీర్తనలు 45:6-7reference

8. But unto the Son He saith, "Thy throne, O God, is for ever and ever; a scepter of righteousness is the scepter of Thy Kingdom.

9. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడుreference నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
referenceకీర్తనలు 45:6-7reference

9. Thou hast loved righteousness and hated iniquity; therefore God, even Thy God, hath anointed Thee with the oil of gladness above Thy fellows."

10. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
referenceఆదికాండము 1:1reference, కీర్తనలు 102:25-26reference

10. And, "Thou, Lord, in the beginning hast laid the foundation of the earth, and the heavens are the works of Thine hands.

11. ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును

11. They shall perish, but Thou remainest; and they all shall wax old as doth a garment.

12. ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.

12. And as a vesture shalt Thou fold them up, and they shall be changed. But Thou art the same, and Thy years shall not fail."

13. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైనయెప్పుడైనను చెప్పెనా?
referenceకీర్తనలు 110:1reference

13. But to which of the angels said He at any time, "Sit on My right hand until I make Thine enemies Thy footstool"?

14. వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
referenceకీర్తనలు 33:6reference, కీర్తనలు 33:9reference, కీర్తనలు 34:7reference, కీర్తనలు 91:11-12reference

14. Are they not all ministering spirits, sent forth to minister for those who shall be heirs of salvation?

0 comments:

Post a Comment