Sunday, 4 January 2015

James - యాకోబు 3

James - యాకోబు 3
1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

1. My brethren, let not many be masters, knowing that we shall receive the greater condemnation.

2. అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగ

2. For in many things we all offend. If any man offend not in word, the same is a perfect man and able also to bridle the whole body.

3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా

3. Behold, we put bits in the horses' mouths, that they may obey us, and we turn about their whole body.

4. ఓడలనుకూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.

4. Behold also the ships, which though they be so great and are driven by fierce winds, yet are they turned about with a very small helm, whithersoever the helmsman pleases.

5. ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!

5. Even so the tongue is a little member and boasteth great things. Behold, how great a wood a little fire kindleth!

6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

6. And the tongue is a fire, a world of iniquity. So is the tongue among our members that it defileth the whole body and setteth on fire the course of nature; and it is set on fire from hell.

7. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

7. For every kind of beast and bird and serpent and thing in the sea is tamed, and hath been tamed, by mankind.

8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
referenceకీర్తనలు 140:3reference

8. But the tongue can no man tame; it is an unruly evil, full of deadly poison.

9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
referenceఆదికాండము 1:26reference

9. Therewith we bless God, even the Father, and therewith we curse men, who are made in the similitude of God.

10. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు.

10. Out of the same mouth proceedeth blessing and cursing. My brethren, these things ought not so to be.

11. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?

11. Doth a fountain send forth from the same place sweet water and bitter?

12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.

12. Can the fig tree, my brethren, bear olive berries, or a vine figs? So no fountain can yield both salt water and fresh.

13. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

13. Who is a wise man and endued with knowledge among you? Let him show his works out of good conduct and with the meekness of wisdom.

14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్య మునకు విరోధముగా అబద్ధమాడవద్దు.

14. But if ye have bitter envy and strife in your hearts, glory not, and lie not against the truth.

15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.

15. Such wisdom descendeth not from above, but is earthly, sensual, devilish.

16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

16. For where envy and strife are, there is confusion and every evil work.

17. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనిన

17. But the wisdom that is from above is first pure, then peaceable, gentle, easy to be entreated, full of mercy and good fruits, without partiality and without hypocrisy.

18. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
referenceయెషయా 32:17reference

18. And the fruit of righteousness is sown in peace of those who make peace.

0 comments:

Post a Comment