Timothy II - 2 తిమోతికి 3
1. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.
1. This know also: that in the last days perilous times shall come.
2. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
2. For men shall be lovers of their own selves, covetous, boasters, proud, blasphemers, disobedient to parents, unthankful, unholy,
3. అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
3. without natural affection, trucebreakers, false accusers, without selfcontrol, fierce, despisers of those who are good,
4. ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,
4. traitors, headstrong, haughty, lovers of pleasures more than lovers of God,
5. పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.
5. having a form of godliness but denying the power thereof. From such turn away.
6. పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను,
6. For of this sort are those who creep into houses and lead captive silly women laden with sins, led away with divers lusts,
7. సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.
7. ever learning and never able to come to the knowledge of the truth.
8. యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎది రింతురు.
referenceనిర్గామకాండము 7:11reference, నిర్గామకాండము 7:22reference
8. Now as Jannes and Jambres withstood Moses, so do these also resist the truth -- men of corrupt minds, reprobate concerning the faith.
9. అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిదికూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.
9. But they shall proceed no further, for their folly shall be manifest unto all men, as theirs also was.
10. అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును,
10. But thou hast fully known my doctrine, manner of life, purpose, faith, longsuffering, charity, patience,
11. అంతి యొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవౖౖె నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్ర
referenceకీర్తనలు 34:19reference
11. persecutions, afflictions which came unto me at Antioch, at Iconium, at Lystra -- what persecutions I endured. But out of them all, the Lord delivered me.
12. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.
12. Yea, and all who will live a godly life in Christ Jesus shall suffer persecution.
13. అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంత కంతకు చెడిపోవుదురు.
13. But evil men and seducers shall wax worse and worse, deceiving and being deceived.
14. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక,
14. But continue thou in the things which thou hast learned and hast been assured of, knowing from whom thou hast learned them,
15. నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.
15. and that from childhood thou hast known the Holy Scriptures, which are able to make thee wise unto salvation through faith which is in Christ Jesus.
16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును,
16. All Scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness,
17. ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.
17. that the man of God may be perfect, thoroughly equipped for all good works.

0 comments:
Post a Comment