Sunday, 4 January 2015

Titus - తీతుకు 2

Titus - తీతుకు 2

1. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధిం చుము.

1. But speak thou the things which befit sound doctrine:

2. ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలె ననియు,

2. that the older men be sober, serious, temperate, sound in faith, in charity, in patience;

3. ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును,మిగుల మద్యపానాసక్తులునై6 యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు,

3. the older women likewise, that they be in behavior as becometh holiness, not false accusers, not given to much wine, teachers of good things,

4. ¸యవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు,

4. that they may teach the young women to be sober, to love their husbands, to love their children,

5. మంచి ఉపదేశముచేయువారునై యుండవలె ననియు బోధించుము.

5. to be discreet, chaste, keepers at home, good, obedient to their own husbands, that the Word of God be not blasphemed.

6. అటువలెనే స్వస్థబుద్దిగలవారై యుండవలెనని ¸యవనపురుషులను హెచ్చరించుము.

6. Likewise exhort the young men to be soberminded,

7. పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యములవిషయమై మాదిరిగా కనుపరచుకొనుము.

7. in all things showing thyself to be a pattern of good works; in doctrine showing uncorruptness, seriousness, sincerity,

8. నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.

8. sound speech which cannot be condemned, that he that is of a contrary mind may be ashamed, having no evil thing to say of you.

9. దాసులైనవారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంక రించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక,

9. Exhort servants to be obedient unto their own masters, and to please them well in all things, not gainsaying,

10. ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చ రించుము.

10. not purloining, but showing all good fidelity, that they may adorn the doctrine of God our Savior in all things.

11. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై

11. For the grace of God that bringeth salvation hath appeared to all men,

12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,

12. teaching us that, denying ungodliness and worldly lusts, we should live soberly, righteously, and godly in this present world,

13. అనగా మహా దేవుడుreferenceను మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెన
referenceహోషేయా 1:7reference

13. looking for that blessed hope and the glorious appearing of the great God and our Savior Jesus Christ,

14. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
referenceనిర్గామకాండము 19:5reference, ద్వితియోపదేశకాండము 4:20reference, ద్వితియోపదేశకాండము 7:6reference, ద్వితియోపదేశకాండము 14:2reference, కీర్తనలు 72:14reference, కీర్తనలు 130:8reference, యెహేజ్కేలు 37:23reference

14. who gave Himself for us, that He might redeem us from all iniquity and purify unto Himself a peculiar people, zealous for good works.

15. వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూ ర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము.

15. These things speak and exhort, and rebuke with all authority. Let no man despise thee.

0 comments:

Post a Comment