Sunday 4 January 2015

Revelation - ప్రకటన గ్రంథము 22

Revelation - ప్రకటన గ్రంథము 22

1. మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహా సనమునొద్దనుండి
referenceయెహేజ్కేలు 47:1reference, యోవేలు 3:18reference, జెకర్యా 14:8reference

1. And he showed me a pure river of the Water of Life, clear as crystal, proceeding out of the throne of God and of the Lamb.

2. ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.
referenceఆదికాండము 2:9-10reference, ఆదికాండము 3:22reference, యెహేజ్కేలు 47:7reference, యెహేజ్కేలు 47:12reference

2. In the midst of the street of it, and on either side of the river, there was the Tree of Life, which bore twelve kinds of fruit and yielded her fruit every month; and the leaves of the tree were for the healing of the nations.

3. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.
referenceజెకర్యా 14:11reference

3. And there shall be no more curse, but the throne of God and of the Lamb shall be in it, and His servants shall serve Him.

4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.
referenceకీర్తనలు 17:15reference, కీర్తనలు 42:2reference

4. And they shall see His face, and His name shall be in their foreheads.

5. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
referenceయెషయా 60:19reference, దానియేలు 7:18reference, దానియేలు 7:27reference, జెకర్యా 14:7reference

5. And there shall be no night there, and they will need no candle, neither light of the sun; for the Lord God giveth them light. And they shall reign for ever and ever.

6. మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.
referenceదానియేలు 2:28reference, దానియేలు 2:45reference

6. And he said unto me, "These sayings are faithful and true," and the Lord God of the holy prophets sent His angel to show unto His servants the things which must shortly be done.

7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.
referenceయెషయా 40:10reference

7. "Behold, I come quickly." Blessed is he that keepeth the sayings of the prophecy of this book.

8. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,

8. And I, John, saw these things and heard them. And when I had heard and seen, I fell down to worship before the feet of the angel who showed me these things.

9. అతడు వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథ మందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

9. Then said he unto me, "See that thou do it not, for I am thy fellow servant, and of thy brethren the prophets, and of them that keep the sayings of this book. Worship God!"

10. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెనుఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;
referenceదానియేలు 12:4reference

10. And he said unto me, "Seal not the sayings of the prophecy of this book, for the time is at hand.

11. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరి శుద్ధుడు ఇం

11. He that is unjust, let him be unjust still; and he that is filthy, let him be filthy still; and he that is righteous, let him be righteous still; and he that is holy, let him be holy still."

12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
referenceకీర్తనలు 28:4reference, కీర్తనలు 62:12reference, సామెతలు 24:12reference, యెషయా 59:18reference, యెషయా 62:11reference, యిర్మియా 17:10reference, యెషయా 40:10reference

12. "And behold, I come quickly, and My reward is with Me, to give to every man according as his work shall be.

13. నేనే అల్ఫాreferenceయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.
referenceయెషయా 44:6reference, యెషయా 48:12reference

13. I am Alpha and Omega, the Beginning and the End, the First and the Last."

14. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
referenceఆదికాండము 2:9reference, ఆదికాండము 49:11reference, ఆదికాండము 49:11reference, ఆదికాండము 3:22reference, యెహేజ్కేలు 47:12reference

14. Blessed are they that do His commandments, that they may have right to the Tree of Life, and may enter in through the gates into the city.

15. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

15. For outside are dogs and sorcerers, and whoremongers and murderers and idolaters, and whosoever loveth and maketh a lie.

16. సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
referenceసంఖ్యాకాండము 24:17reference, యెషయా 11:1reference, యెషయా 11:10reference

16. "I, Jesus, have sent Mine angel to testify unto you these things in the churches. I am the Root and the Offspring of David, and the Bright and Morning Star."

17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
referenceజెకర్యా 14:8reference, యెషయా 55:1reference

17. And the Spirit and the bride say, "Come." And let him that heareth say, "Come." And let him that is athirst come; and whosoever will, let him take the Water of Life freely.

18. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడుreference వానికి కలుగజేయును;
referenceద్వితియోపదేశకాండము 4:2reference, ద్వితియోపదేశకాండము 12:32reference, ద్వితియోపదేశకాండము 29:20reference

18. For I testify unto every man that heareth the words of the prophecy of this book: If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book.

19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడుreference ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
referenceఆదికాండము 3:22reference, యెహేజ్కేలు 47:12reference, యెహేజ్కేలు 47:12reference, ఆదికాండము 2:9reference

19. And if any man shall take away from the words of the book of this prophecy, God shall take away his part out of the Book of Life and out of the Holy City, and from the things which are written in this book.

20. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము.

20. He that testifieth these things saith, "Surely I come quickly." Amen. Even so, come, Lord Jesus.

21. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌.

21. The grace of our Lord Jesus Christ be with you all. Amen.

0 comments:

Post a Comment